Monday, 8 May 2017

మహేష్ కోసం పూరి అంత కష్టపడిపోయాడా?



వారం రోజుల్లో కథ రాసేస్తా.. రెండు వారాల్లో డైలాగ్ వెర్షన్ సహా స్క్రిప్టు రెడీ అయిపోతుంది అని చెబుతుంటాడు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఆయన సినిమాలు బాగా ఆడుతున్నపుడు ఈ ముచ్చట్లు బాగానే ఉండేవి. అంత వేగంగా స్క్రిప్టు రాసేస్తాడు అని జనాలు ఆశ్చర్యపోయేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో ఇవే మాటల్ని పూరి రిపీట్ చేస్తుంటే మాత్రం జనాలకు చిరాకు పుడుతోంది.

ఎందుకంటే ఆయన నుంచి వస్తున్న సినిమాలు అలా ఉంటున్నాయి మరి. జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, రోగ్ లాంటి సినిమాల కథల్ని వారంలో రాస్తే ఏంటి.. ఒక్క రోజులో రాస్తే ఏంటి అన్నది జనాల వాదన. ఈ ఫ్రస్టేషన్ పూరి వరకు చేరినట్లుంది. అందుకే ఆయన వారం.. రెండు వారాల మాటలు మాట్లాడట్లేదు.

మహేష్ బాబు కోసం ఓ కథ రాయడానికి రెండు నెలల సమయం తీసుకున్నట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు పూరి జగన్నాథ్. ఆ కథే.. ‘జనగణమన’ అట. తన కెరీర్లో ఓ కథ కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్నది దీని కోసమే అంటున్నాడు పూరి. ఎంతో ఇష్టంతో ఈ కథ రాశానని పూరి చెప్పాడు. కానీ పాపం పూరి అంత సమయం పెట్టి కథ రాసినా మహేష్ బాబు ఆయన్ని కనికరించలేదు. 

subscribe my channel


పూరి పాటికి పూరి ట్విట్టర్లో ఈ సినిమాను అనౌన్స్ చేసేయగా.. మహేష్ మాత్రం పచ్చజెండా ఊపలేదు. వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు. మహేష్ తనకు ఎస్ ఆర్ నో ఏదీ చెప్పకపోవడంపై ఆ మధ్య ‘ఇజం’ ప్రమోషన్ల సందర్భంగా అసహనం వ్యక్తం చేశాడు పూరి. కానీ ఆ సినిమాతో పాటు ‘రోగ్’ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో పూరిలో మార్పు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మహేష్ సినిమా మీద ఆశతో మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి.. 2018లో మహేష్ సినిమాను పట్టాలెక్కించాలని కోరుకుంటున్నాడు. బాలయ్య సినిమా అయ్యాక స్క్రిప్టును మరింత బాగా తీర్చిదిద్దుకుని మహేష్‌ను కలవాలని చూస్తున్నాడు

niharika

నీహారిక‌తో పెళ్లి రూమ‌ర్.. తేజు స్పంద‌న ఇదీ




రెండు రోజుల నుంచి ఒక వార్త‌తో సోష‌ల్ మీడియా.. వెబ్ మీడియా హోరెత్తిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌కు.. నాగ‌బాబు త‌న‌యురాలు నీహారిక‌కు పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని.. వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని ఊహాగానాలు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. కొంద‌రైతే ఎప్పుడు పెళ్లి అన్న స‌మాచారం కూడా ఇచ్చేశారు. ఐతే ఇది గాలి వార్త అని.. దీనిపై మెగా ఫ్యామిలీ చాలా అప్సెట్ అయింద‌ని స‌మాచారం. స్వ‌యంగా సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ ప్ర‌చారంపై స్పందించాడు. ఈ వార్త‌ను ఖండించాడు.

https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg


subscribe my channel 

victory

వ‌ర‌స ప్ర‌కారం నీహారిక తేజుకు మ‌ర‌ద‌లు కాగా.. అత‌ను మాత్రం ఆమె త‌న‌కు చెల్లెలు లాంటిద‌ని చెప్పాడు. చిన్నప్పటి నుంచి తామంద‌రం ఒకే కుటంటుంలా.. అన్నాచెల్లెళ్ల మాదిరే పెరిగామని.. త‌మ‌కు పెళ్లేంట‌ని.. ఇలాంటి వార్తలు రాసేటప్పుడు అధికారికంగా ఒకసారి సరిచూసుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాకు హిత‌వు ప‌లికాడు తేజు. అందులోనూ ఒక మహిళకు సంబంధించిన వార్త రాసేట‌పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. 

ఇలాంటి ఆధారరహిత వార్తలు చాలా బాధపెడ‌తాయని తేజు అన్నాడు. తేజు చిరంజీవి సోదరి విజయదుర్గకు పెద్ద కొడుక‌న్న సంగ‌తి తెలిసిందే. తేజు మాత్ర‌మే కాదు బ‌న్నీ కూడా చ‌ర‌ణ్, వ‌రుణ్‌, నీహారిక‌ల‌ను తోడ‌బుట్టిన వాళ్ల‌లా ట్రీట్ చేస్తాడు. మావ‌య్య అయిన ప‌వ‌న్‌ను అత‌ను బాబాయి అంటాడ‌న్న సంగ‌తి తెలిసిందే

Sunday, 30 April 2017

bahubali movie records

ఒక్క రోజులో శ్రీమంతుడు అవుట్‌!

యుఎస్‌లో మహేష్‌బాబు ఎంతటి శక్తివంతమైన స్టార్‌ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బాహుబలి మొదటి భాగం మినహాయిస్తే, యుఎస్‌లో మూడు మిలియన్‌ డాలర్ల వసూళ్లకి దగ్గరగా వెళ్లింది మహేష్‌బాబు ఒక్కడే. ఫుల్‌ రన్‌లో 2.9 మిలియన్‌ డాలర్లను శ్రీమంతుడు వసూలు చేస్తే, ఒకే ఒక్క రోజులో బాహుబలి దానిని కొట్టేయడం చూసి తలలు పండిన ట్రేడ్‌ పండితులే ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రీమియర్లు, శుక్రవారం కలిపి నాలుగున్నర మిలియన్‌ డాలర్లకి పైగా వసూలు చేసిన 'బాహుబలి 2' శనివారం మాత్రం మూడు మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఇంకా పూర్తి లెక్కలు రాలేదు కానీ భారతీయ సినీ చరిత్రలో యుఎస్‌లో ఒక్క రోజులో ఇంత వసూలు చేసిన చిత్రమే ఇంకోటి లేదట. 
SUBSCRIBE MY CHANNEL
victory

ఆదివారానికల్లా పది మిలియన్లు చేరుకుంటుందా లేదా అని చర్చ జరుగుతోంది. తెలుగు సినీ చరిత్రలో పది మిలియన్లు దాటుతోన్న మొదటి చిత్రంగా బాహుబలి రికార్డులకి ఎక్కనుంది. పదిహేను మిలియన్‌ డాలర్లకి పైసా తగ్గదంటోన్న ఈ చిత్రం రాబోయే బాలీవుడ్‌ చిత్రాలకి కూడా బెంచ్‌మార్క్‌ని అందనంత ఎత్తులో పెడుతోంది.

facebook,google

ఫేస్ బుక్, గూగుల్ ను బ్యాన్ చేయమంటున్నాడు



అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలను విధించడంపై ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు. అమెరికా చర్యలకు ప్రతిగా భారత్ కూడా అదే రీతిలో రియాక్ట్ అవ్వాల‌ని ఆయ‌న సూచించారు. ఇందుకోసం సోష‌ల్ మీడియాలో అమెరికాకు చెందిన పాపుల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లైన  ఫేస్‌బుక్, గూగుల్, వాట్సప్‌లను నిషేధించాలని అభిప్రాయపడ్డారు.

అప్పుడే అమెరికాకు భార‌త్ స‌త్తా తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇలాంటి సెర్చ్ ఇంజన్లు, యాప్‌లు చాలా ఉన్నాయని, అలాంటప్పుడు అమెరికాకు చెందిన వాటిని ఎందుకు ఉపయోగించాలని మిట్ట‌ల్ సూటిగా ప్రశ్నించారు. 

SUBSCRIBE MY CHANNEL

VICTORY

www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg


మీడియాతో మాట్లాడిన సునీల్ మిట్ట‌ల్ భారతీయుల రాకపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. మ‌న సేవ‌ల‌తో అమెరికా సంస్థ‌లు పెద్ద ఎత్తున లాభాలు అర్జిస్తున్నాయ‌ని తెలిపారు. భార‌తీయుల నిబ‌ద్ద‌త‌, క‌ష్టం చేసే త‌త్వం, సృజ‌నాత్మ‌క‌తను వేనేళ్ల పొగిడి ఇపుడు ఆలోచ‌న‌లను మార్చుకోవ‌డం ఏమిట‌ని ఎయిర్ టెల్ అధినేత‌ ప్ర‌శ్నించారు. 

విదేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో వ్యాపారం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాయని, ఈ విషయాన్ని ఆయా దేశాలు గుర్తించాలని తెలిపారు.

Friday, 28 April 2017

bahubali boxoffice

బాహుబలికి బాక్సాఫీస్‌ దాసోహం





బాహుబలి మొదటి భాగమే ఇండియన్‌ సినిమా హిస్టరీలో రికార్డ్‌ సృష్టించింది. అన్ని భాషల్లోను కలిపి ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. అయితే బాలీవుడ్‌ మీడియా దీనిని తెలివిగా విస్మరించింది. దంగల్‌, పీకే చిత్రాల గురించి తప్ప బాహుబలి ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద వసూలు చేసిన అంకెలని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే అప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈసారి మాత్రం ఎవరైనా తలవంచక తప్పదు.

దంగల్‌ లేదు, పీకే లేదు... బాహుబలి 2 తర్వాత ఇక ఇండియాలో ఏ రికార్డు మిగలదు. ఈ చిత్రం హిందీ వెర్షన్‌కి నాన్‌ హాలిడే రోజుకి జరుగుతోన్న బుకింగ్స్‌ చూసి బాలీవుడ్‌ మీడియా విస్తుపోతోంది. ఖాన్‌లు కాకుండా మరే హీరో వల్ల కాని దానిని ఒక తెలుగు అనువాద చిత్రం వచ్చి బాక్సాఫీస్‌ని కుదిపేస్తోంది. 

డిమాండ్‌ అధికంగా వుండడంతో హిందీ చిత్రాల షోలు తగ్గించి, బాహుబలికి షోస్‌ పెంచుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా టికెట్ల కోసం డిమాండ్‌ తీవ్రంగా వుంది. ఎలాగైనా తొలి రోజు చూడాలనే ఆరాటం ఎక్కువవుతోంది. దీంతో ప్రీమియమ్‌ రేట్లకి టికెట్లు విక్రయిస్తూ, ఫుడ్‌ కాంబోలు అవీ అంటూ జనాన్ని ఎగ్జిబిటర్లు దోచుకుంటున్నారు. 

subscribe my channel 
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg

మొదటి రోజు ఇండియాలో వంద కోట్ల నెట్‌ వసూళ్లు సాధించే మొదటి చిత్రంగా బాహుబలి రికార్డుకెక్కడం ఖాయమని బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వెబ్‌సైట్లే అంటున్నాయంటే పరిస్థితి ఎలాగుందనేది అర్థం చేసుకోవచ్చు.


వైట్ల ఆ ఇంటిని అమ్మేస్తున్నాడా?





ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం అంటే ఏంటో శ్రీను వైట్లను చూసే తెలుసుకోవాలి. పుష్కర కాలం పాటలు అపజయం అన్నదే లేకుండా సాగిపోయిన ఈ దర్శకుడు.. 'ఆగడు' రూపంలో ఒక్క ఎదురు దెబ్బకే కుదేలైపోయాడు. 'బ్రూస్ లీ' అతణ్ని మరింత కిందికి తొక్కేసింది.
తాజా 'మిస్టర్' రూపంలో అగ్ని పరీక్షను ఎదుర్కొన్న వైట్ల.. ఈ పరీక్షలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ దెబ్బతో అతడి భవిష్యత్తే కాదు.. వర్తమానం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిర్మాతలకు ఇచ్చిన హామీకి భిన్నంగా సినిమా బడ్జెట్‌ను హద్దులు దాటించేసిన వైట్ల.. ఇప్పుడు సినిమా వైఫల్యానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
subscribe my channel

'మిస్టర్' నిర్మాతలు వైట్ల పారితోషకంతో పాటు.. మరికొంత పరిహారం కూడా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం వైట్ల తన ఇంటినే అమ్మేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. ఆ ఇంటి వాస్తు విషయంలోనూ వైట్ల చాలా నెగెటివ్‌గా ఉన్నాడు. ఈ ఇంట్లోకి మారాకే తన పరిస్థితి బాగా లేదని భావిస్తున్నాడు. ఐతే మళ్లీ వాస్తు మార్పులు చేయడం కంటే ఇంటినే అమ్మేసి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలని వైట్ల భావిస్తున్నాడట. 

అందుకే ఇంటిని బేరానికి పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. 'మిస్టర్' నిర్మాతలకు న్యాయం చేయని పరిస్థితుల్లో తనకు మరో అవకాశం దక్కడమే కష్టమవుతుందని.. ఇండస్ట్రీలో తన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడి వైట్ల ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Wednesday, 26 April 2017

spider re shoot effect

స్పైడర్‌: రీషూట్ల ఎఫెక్టే ఇది


జూన్‌ 23న రావాల్సిన స్పైడర్‌ వాయిదా పడినట్టేనని తేలిపోయింది. అదే రోజున 'దువ్వాడ జగన్నాథమ్‌'తో పాటు 'నిన్నుకోరి' సినిమా రిలీజ్‌ని అనౌన్స్‌ చేసారంటేనే స్పైడర్‌ వాయిదాపై స్పష్టమైన సమాచారం అందిందని అర్థమైంది. ఏడాది క్రితమే మొదలు పెట్టిన మురుగదాస్‌ సినిమా డిసెంబర్‌ నాటికే డెబ్బయ్‌ శాతం పూర్తయిందని అన్నారు.
ఫిబ్రవరికి షూటింగ్‌ పూర్తయిపోతుందని, ఏప్రిల్‌ లేదా మేలో రిలీజ్‌ చేసేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే బాహుబలితో క్లాష్‌ వద్దని జూన్‌ 23కి రిలీజ్‌ ఫిక్స్‌ చేసారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌కి కూడా సినిమా రావడం లేదు. మొదట తీసిన సీన్లు చాలా వరకు తొలగించారని, వాటిని మళ్లీ రీషూట్‌ చేసారని ఆమధ్య గాసిప్స్‌ వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని స్పైడర్‌ టీమ్‌ ఖండించింది.

ఎంత భారీ చిత్రాన్ని అయినా ఆరు లేదా ఏడు నెలల్లో పూర్తి చేసేసే మురుగదాస్‌ ఈ చిత్రానికి ఇంత టైమ్‌ ఎందుకు తీసుకుంటున్నట్టు? ఇదేమీ గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా కూడా కాదే? తుపాకి, కత్తి లాంటి సోషల్‌ ఎలిమెంట్స్‌ వున్న కమర్షియల్‌ చిత్రమే అయినపుడు ఎందుకని ఇంత టైమ్‌ పడుతోంది.
subscribe my channel
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg

ఇంకా నలభై రోజుల షూటింగ్‌ బాకీ వుందంటే రీషూట్స్‌ ఎఫెక్ట్‌ కాక ఇంకేమిటి మరి? అయినా నాగార్జున చెప్పినట్టు రీషూట్స్‌ చేయడం తప్పేమీ కాదు. అనుకున్నది అనుకున్నట్టు రానపుడు దానిని ముందే కరక్ట్‌ చేసుకోవడం మంచి పద్ధతే.