Sunday, 30 April 2017

bahubali movie records

ఒక్క రోజులో శ్రీమంతుడు అవుట్‌!

యుఎస్‌లో మహేష్‌బాబు ఎంతటి శక్తివంతమైన స్టార్‌ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. బాహుబలి మొదటి భాగం మినహాయిస్తే, యుఎస్‌లో మూడు మిలియన్‌ డాలర్ల వసూళ్లకి దగ్గరగా వెళ్లింది మహేష్‌బాబు ఒక్కడే. ఫుల్‌ రన్‌లో 2.9 మిలియన్‌ డాలర్లను శ్రీమంతుడు వసూలు చేస్తే, ఒకే ఒక్క రోజులో బాహుబలి దానిని కొట్టేయడం చూసి తలలు పండిన ట్రేడ్‌ పండితులే ముక్కున వేలేసుకుంటున్నారు.
ప్రీమియర్లు, శుక్రవారం కలిపి నాలుగున్నర మిలియన్‌ డాలర్లకి పైగా వసూలు చేసిన 'బాహుబలి 2' శనివారం మాత్రం మూడు మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వసూలు చేసింది. ఇంకా పూర్తి లెక్కలు రాలేదు కానీ భారతీయ సినీ చరిత్రలో యుఎస్‌లో ఒక్క రోజులో ఇంత వసూలు చేసిన చిత్రమే ఇంకోటి లేదట. 
SUBSCRIBE MY CHANNEL
victory

ఆదివారానికల్లా పది మిలియన్లు చేరుకుంటుందా లేదా అని చర్చ జరుగుతోంది. తెలుగు సినీ చరిత్రలో పది మిలియన్లు దాటుతోన్న మొదటి చిత్రంగా బాహుబలి రికార్డులకి ఎక్కనుంది. పదిహేను మిలియన్‌ డాలర్లకి పైసా తగ్గదంటోన్న ఈ చిత్రం రాబోయే బాలీవుడ్‌ చిత్రాలకి కూడా బెంచ్‌మార్క్‌ని అందనంత ఎత్తులో పెడుతోంది.

facebook,google

ఫేస్ బుక్, గూగుల్ ను బ్యాన్ చేయమంటున్నాడు



అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలను విధించడంపై ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు. అమెరికా చర్యలకు ప్రతిగా భారత్ కూడా అదే రీతిలో రియాక్ట్ అవ్వాల‌ని ఆయ‌న సూచించారు. ఇందుకోసం సోష‌ల్ మీడియాలో అమెరికాకు చెందిన పాపుల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లైన  ఫేస్‌బుక్, గూగుల్, వాట్సప్‌లను నిషేధించాలని అభిప్రాయపడ్డారు.

అప్పుడే అమెరికాకు భార‌త్ స‌త్తా తెలుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. భారత్‌లో ఇలాంటి సెర్చ్ ఇంజన్లు, యాప్‌లు చాలా ఉన్నాయని, అలాంటప్పుడు అమెరికాకు చెందిన వాటిని ఎందుకు ఉపయోగించాలని మిట్ట‌ల్ సూటిగా ప్రశ్నించారు. 

SUBSCRIBE MY CHANNEL

VICTORY

www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg


మీడియాతో మాట్లాడిన సునీల్ మిట్ట‌ల్ భారతీయుల రాకపై అమెరికా ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. మ‌న సేవ‌ల‌తో అమెరికా సంస్థ‌లు పెద్ద ఎత్తున లాభాలు అర్జిస్తున్నాయ‌ని తెలిపారు. భార‌తీయుల నిబ‌ద్ద‌త‌, క‌ష్టం చేసే త‌త్వం, సృజ‌నాత్మ‌క‌తను వేనేళ్ల పొగిడి ఇపుడు ఆలోచ‌న‌లను మార్చుకోవ‌డం ఏమిట‌ని ఎయిర్ టెల్ అధినేత‌ ప్ర‌శ్నించారు. 

విదేశాలకు చెందిన సంస్థలు భారత్‌లో వ్యాపారం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నాయని, ఈ విషయాన్ని ఆయా దేశాలు గుర్తించాలని తెలిపారు.

Friday, 28 April 2017

bahubali boxoffice

బాహుబలికి బాక్సాఫీస్‌ దాసోహం





బాహుబలి మొదటి భాగమే ఇండియన్‌ సినిమా హిస్టరీలో రికార్డ్‌ సృష్టించింది. అన్ని భాషల్లోను కలిపి ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. అయితే బాలీవుడ్‌ మీడియా దీనిని తెలివిగా విస్మరించింది. దంగల్‌, పీకే చిత్రాల గురించి తప్ప బాహుబలి ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద వసూలు చేసిన అంకెలని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే అప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈసారి మాత్రం ఎవరైనా తలవంచక తప్పదు.

దంగల్‌ లేదు, పీకే లేదు... బాహుబలి 2 తర్వాత ఇక ఇండియాలో ఏ రికార్డు మిగలదు. ఈ చిత్రం హిందీ వెర్షన్‌కి నాన్‌ హాలిడే రోజుకి జరుగుతోన్న బుకింగ్స్‌ చూసి బాలీవుడ్‌ మీడియా విస్తుపోతోంది. ఖాన్‌లు కాకుండా మరే హీరో వల్ల కాని దానిని ఒక తెలుగు అనువాద చిత్రం వచ్చి బాక్సాఫీస్‌ని కుదిపేస్తోంది. 

డిమాండ్‌ అధికంగా వుండడంతో హిందీ చిత్రాల షోలు తగ్గించి, బాహుబలికి షోస్‌ పెంచుతున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా టికెట్ల కోసం డిమాండ్‌ తీవ్రంగా వుంది. ఎలాగైనా తొలి రోజు చూడాలనే ఆరాటం ఎక్కువవుతోంది. దీంతో ప్రీమియమ్‌ రేట్లకి టికెట్లు విక్రయిస్తూ, ఫుడ్‌ కాంబోలు అవీ అంటూ జనాన్ని ఎగ్జిబిటర్లు దోచుకుంటున్నారు. 

subscribe my channel 
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg

మొదటి రోజు ఇండియాలో వంద కోట్ల నెట్‌ వసూళ్లు సాధించే మొదటి చిత్రంగా బాహుబలి రికార్డుకెక్కడం ఖాయమని బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వెబ్‌సైట్లే అంటున్నాయంటే పరిస్థితి ఎలాగుందనేది అర్థం చేసుకోవచ్చు.


వైట్ల ఆ ఇంటిని అమ్మేస్తున్నాడా?





ఓడలు బళ్లు.. బళ్లు ఓడలు కావడం అంటే ఏంటో శ్రీను వైట్లను చూసే తెలుసుకోవాలి. పుష్కర కాలం పాటలు అపజయం అన్నదే లేకుండా సాగిపోయిన ఈ దర్శకుడు.. 'ఆగడు' రూపంలో ఒక్క ఎదురు దెబ్బకే కుదేలైపోయాడు. 'బ్రూస్ లీ' అతణ్ని మరింత కిందికి తొక్కేసింది.
తాజా 'మిస్టర్' రూపంలో అగ్ని పరీక్షను ఎదుర్కొన్న వైట్ల.. ఈ పరీక్షలో దారుణంగా విఫలమయ్యాడు. ఈ దెబ్బతో అతడి భవిష్యత్తే కాదు.. వర్తమానం కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది. నిర్మాతలకు ఇచ్చిన హామీకి భిన్నంగా సినిమా బడ్జెట్‌ను హద్దులు దాటించేసిన వైట్ల.. ఇప్పుడు సినిమా వైఫల్యానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
subscribe my channel

'మిస్టర్' నిర్మాతలు వైట్ల పారితోషకంతో పాటు.. మరికొంత పరిహారం కూడా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం వైట్ల తన ఇంటినే అమ్మేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. ఆ ఇంటి వాస్తు విషయంలోనూ వైట్ల చాలా నెగెటివ్‌గా ఉన్నాడు. ఈ ఇంట్లోకి మారాకే తన పరిస్థితి బాగా లేదని భావిస్తున్నాడు. ఐతే మళ్లీ వాస్తు మార్పులు చేయడం కంటే ఇంటినే అమ్మేసి అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలని వైట్ల భావిస్తున్నాడట. 

అందుకే ఇంటిని బేరానికి పెట్టినట్లు వార్తలొస్తున్నాయి. 'మిస్టర్' నిర్మాతలకు న్యాయం చేయని పరిస్థితుల్లో తనకు మరో అవకాశం దక్కడమే కష్టమవుతుందని.. ఇండస్ట్రీలో తన మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని భయపడి వైట్ల ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Wednesday, 26 April 2017

spider re shoot effect

స్పైడర్‌: రీషూట్ల ఎఫెక్టే ఇది


జూన్‌ 23న రావాల్సిన స్పైడర్‌ వాయిదా పడినట్టేనని తేలిపోయింది. అదే రోజున 'దువ్వాడ జగన్నాథమ్‌'తో పాటు 'నిన్నుకోరి' సినిమా రిలీజ్‌ని అనౌన్స్‌ చేసారంటేనే స్పైడర్‌ వాయిదాపై స్పష్టమైన సమాచారం అందిందని అర్థమైంది. ఏడాది క్రితమే మొదలు పెట్టిన మురుగదాస్‌ సినిమా డిసెంబర్‌ నాటికే డెబ్బయ్‌ శాతం పూర్తయిందని అన్నారు.
ఫిబ్రవరికి షూటింగ్‌ పూర్తయిపోతుందని, ఏప్రిల్‌ లేదా మేలో రిలీజ్‌ చేసేస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే బాహుబలితో క్లాష్‌ వద్దని జూన్‌ 23కి రిలీజ్‌ ఫిక్స్‌ చేసారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌కి కూడా సినిమా రావడం లేదు. మొదట తీసిన సీన్లు చాలా వరకు తొలగించారని, వాటిని మళ్లీ రీషూట్‌ చేసారని ఆమధ్య గాసిప్స్‌ వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని స్పైడర్‌ టీమ్‌ ఖండించింది.

ఎంత భారీ చిత్రాన్ని అయినా ఆరు లేదా ఏడు నెలల్లో పూర్తి చేసేసే మురుగదాస్‌ ఈ చిత్రానికి ఇంత టైమ్‌ ఎందుకు తీసుకుంటున్నట్టు? ఇదేమీ గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా కూడా కాదే? తుపాకి, కత్తి లాంటి సోషల్‌ ఎలిమెంట్స్‌ వున్న కమర్షియల్‌ చిత్రమే అయినపుడు ఎందుకని ఇంత టైమ్‌ పడుతోంది.
subscribe my channel
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg

ఇంకా నలభై రోజుల షూటింగ్‌ బాకీ వుందంటే రీషూట్స్‌ ఎఫెక్ట్‌ కాక ఇంకేమిటి మరి? అయినా నాగార్జున చెప్పినట్టు రీషూట్స్‌ చేయడం తప్పేమీ కాదు. అనుకున్నది అనుకున్నట్టు రానపుడు దానిని ముందే కరక్ట్‌ చేసుకోవడం మంచి పద్ధతే. 




Monday, 24 April 2017

CHARAN NEW FILM

మెగాస్టార్‌ని మరిపించే 'చేపల చిట్టిబాబు'


నూట యాభై చిత్రాల్లో చిరంజీవి ఎక్కువగా చేసినవి కమర్షియల్‌, మాస్‌ పాత్రలే. నటుడిగా చిరంజీవికి గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి 'స్వయంకృషి'లో చేసిన సాంబయ్య. చరణ్‌ కూడా ఆ తరహా డీ గ్లామరైజ్డ్‌ పాత్రని తొలిసారిగా చేస్తున్నాడు సుకుమార్‌ చిత్రంలో. ఇంకా పేరు పెట్టని ఈ పల్లెటూరి ప్రేమకథా చిత్రంలో చరణ్‌ చేపలమ్మే యువకుడి పాత్ర చేస్తున్నాడు. అంతే కాకుండా కాస్త వినికిడి లోపమున్న ఉద్వేగపూరిత పాత్ర ఇది. 

ఎక్కువగా రిచ్‌, అర్బన్‌ క్యారెక్టర్లు చేసిన చరణ్‌ని పూర్తిగా కొత్తగా చూపించడానికి సుకుమార్‌ ఈ పాత్రని ఎంచుకున్నాడు. ఇందులో చరణ్‌ పాత్ర పేరు చిట్టిబాబు అనేది తెలిసిందే. నటుడిగా చిరంజీవికి 'స్వయంకృషి' ఎంతటి పేరు తెచ్చిందో చరణ్‌కి కూడా 'చేపల చిట్టిబాబు' క్యారెక్టర్‌ అంత ప్లస్‌ అవుతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అచ్చమైన గోదావరి జిల్లాల భాష, యాస, వేషం అన్నీ ఈ చిత్రంలో నిక్షిప్తం చేస్తున్నారట. 

అది కూడా సాంకేతిక విప్లవం మొదలు కాని రోజుల్లో, సెల్‌ఫోన్లు గట్రా రాని కాలంలో సెట్‌ చేసిన లవ్‌స్టోరీ కావడంతో ఇది ఈతరం ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇచ్చి, ఆ తరం వారికి గత జ్ఞాపకాలని గుర్తు చేసే చిత్రమవుతుందని అంటున్నారు. చేపల చిట్టిబాబుగా చరణ్‌ నిజంగానే 'చెప్పుల సాంబయ్య'ని మరిపిస్తాడేమో చూద్దాం
.

this channel main focus entertainment, beauty tips, health tips .....
SUBSCRIBE MY CHANNEL
VICTORY
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg


mahesh babu spider movie

కంట్రోల్‌ తప్పుతోన్న మహేష్‌ స్పైడర్




ఏప్రిల్‌లో షూటింగ్‌ ప్లాన్‌కి అనుగుణంగా జరగకపోవడంతో మహేష్‌ 'స్పైడర్‌' డిలే అవుతోంది. ఏప్రిల్‌లో కేవలం నాలుగైదు రోజుల షూటింగ్‌ మాత్రమే జరగడం వల్ల మరో యాభై రోజుల షూట్‌ మిగిలిపోయింది. మంచి డేట్‌ అనుకున్న జూన్‌ 23 మిస్‌ అవడంతో ఇక స్పైడర్‌ని ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారట. 

ఆగస్టు 11న విడుదల చేయడానికి హిందీ, తమిళంలో క్లాష్‌ ఏర్పడుతుందని ఆగస్టు 25న విడుదల చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారని, ఒకవేళ యాక్షన్‌ పార్ట్‌ షూటింగ్‌ మరీ ఎక్కువ సమయం తీసుకున్నట్టయితే ఈ చిత్రం దసరాకి వెళ్లినా వెళుతుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది. ఏడాదికి పైగా సెట్స్‌ మీద వున్న ఈ చిత్రానికి ఇప్పటికే బడ్జెట్‌ అనుకున్న దానికంటే ఎక్కువ అయిందని, వంద కోట్ల బడ్జెట్‌లో అనుకున్న చిత్రం నూట ఇరవై కోట్లపైనే అయ్యేటట్టు వుందని టాక్‌ వినిపిస్తోంది. 

మూడు భాషల్లోను కలిపి నూట యాభై కోట్ల బిజినెస్‌ జరుగుతుందని అంచనాలున్నాయి కనుక ప్రస్తుతానికి నిర్మాతలు వర్రీ కావడం లేదు. అయితే బడ్జెట్‌ పెరగడం వల్ల తమిళ, హిందీ మార్కెట్ల నుంచి ఆశించిన స్థాయిలో బిజినెస్‌ జరగకపోతే మాత్రం చిక్కులు తప్పవంటున్నారు. ఏ సినిమాకీ వంద రోజులు మించి వర్కింగ్‌ డేస్‌ తీసుకోని మురుగదాస్‌ మొదటిసారి ఇలా కంట్రోల్‌ తప్పడం గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.
subscribe my channel
https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg

nani new film release

మరి నాని ఏం చేస్తాడిప్పుడు?






'స్పైడర్' సినిమా జూన్ 23 నుంచి వాయిదా పడబోతోందని ముందుగా హింట్ ఇచ్చింది నాని సినిమా 'నిన్ను కోరి' నిర్మాతలే. తమ సినిమాను జూన్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రెస్ నోట్ ఇవ్వడం ద్వారా.. 'స్పైడర్' అనుకున్న తేదీకి రాబోదని తేల్చేశారు. అదే సమయంలో 'దువ్వాడ జగన్నాథం' విషయంలోనూ అయోమయం నెలకొంది.
నాని సినిమా జూన్ 23న వచ్చేస్తే.. మే 19 నుంచి అదే తేదీకి వాయిదా పడ్డ 'డీజే' పరిస్థితి ఏంటి అనుకున్నారంతా. కానీ నాని సినిమా రిలీజ్ డేట్ గురించి ప్రకటన వచ్చిన 24 గంటలకే 'డీజే' వార్తల్లోకి వచ్చాడు. ఆ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయబోతున్నట్లు ఘనంగా ప్రకటించేశాడు నిర్మాత దిల్ రాజు.

ఇప్పుడిక నాని సినిమాను ఏం చేస్తారో చూడాలి. కచ్చితంగా డేట్ మార్చుకోవాల్సిందే. నాని గత రెండేళ్లలో ఎంత ఎదిగినప్పటికీ.. బన్నీ సినిమాతో పోటీ పడే స్థాయికింకా చేరలేదు. మంచి డేట్ దొరికింది కదా అన్న సంబరంలో బెర్తు బుక్ చేయబోతే.. ఆ ఆనందం ఒక్క రోజులో ఆవిరైంది. ఈ డేట్ మిస్సయింది కాబట్టి జులై 7న మీద దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. 

ఐతే ఆ రోజుకు ఆల్రెడీ బోయపాటి శ్రీను-బెల్లంకొండ శ్రీనివాస్‌ల సినిమాకు డేట్ ఇచ్చేశారు. మరి నాని సినిమాను ఏం చేస్తారో చూడాలి. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో చివరి షెడ్యూల్ ముగింపు దశలో ఉంది. శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన నివేదా థామస్ నటిస్తోంది. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.

అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్‌లో మ‌రో దారుణం



అగ్ర‌రాజ్యం అమెరికాలో విమానయ సిబ్బంది రెచ్చిపోతున్నారు. ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌  విమానంలో ఓ వ్యక్తిని దారుణంగా విమానం నుంచే దించేయగా తాజాగా అలాంటి  ఘటనే అమెరికా ఎయిర్‌ లైన్స్ విమానంలో జరిగింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటు చేసుకుంది. ఓ పాపతో కలిసి విమానం ఎక్కిన మహిళ పట్ల సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారు.
కారణమెంటో తెలియదు గానీ ఆ మహిళను ఆమెతో పాటు ఉన్న పాపను విమానం నుంచి దించేశారు. మహిళకు మద్దతుగా మాట్లాడిన వ్యక్తిపై కూడా చేయి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ తతంగాన్ని మరో ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయటంతో విషయంవెలుగులోకి వచ్చింది. 
SUBSCRIBE my channel

Sunday, 23 April 2017

రమ రాజమౌళి ఎలా స్టైలిస్ట్ అయింది?



రాజమౌళి భార్యగా కంటే రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎక్కువ గుర్తింపు సంపాదించింది రమ. ఏదో రాజమౌళి భార్య కాబట్టి అవకాశం దక్కుతోందని అనుకుంటే పొరబాటే. రాజమౌళి సినిమాల్లో కాస్ట్యూమ్స్ ఎంత ప్రత్యేకంగా ఉంటాయో.. దీనికి సంబంధించి ఎంత పని ఉంటుందో ఆ సినిమాలు చూస్తే అర్థమవుతుంది. మరి రమ అసలీ రంగంలోకి ఎలా వచ్చింది.. ఎలా ప్రావీణ్యం సంపాదించింది.. ఎలా తన ప్రత్యేకతను చాటుకుంది.. ఆ విశేషాలేంటో రమ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘మొదట్నుంచీ నేను కెరీర్లో ఏదో అయిపోవాలని అనుకోలేదు. మా అమ్మ చదువుకోమన్నా పెద్ద పట్టించుకోలేదు. రాజమౌళితో పెళ్లయిన తర్వాత కూడా సినిమాల్లో పని చేయాలని కానీ.. కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలని కానీ ఆలోచన లేదు. ఐతే రాజమౌళికి క్యారియర్ తీసుకుని షూటింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్లినపుడు ఈ రంగంపై ఆసక్తి పెరిగింది. ‘సింహాద్రి’ షూటింగ్ జరుగుతుండగా.. కాస్ట్యూమ్స్ లో కొన్ని రాజమౌళికి నచ్చలేదు. మార్చి చేయించుకుందామంటే అసలు సమస్య ఏంటో చెప్పడం తనకు తెలిసేది కాదు. అప్పుడు నేను కలర్ కాంబినేషన్ విషయంలో సలహాలిచ్చేదాన్ని. అలా నాకు తెలియకుండానే ఈ విభాగంలో ఇన్వాల్వ్ అయ్యాను. పాటలు తీసేటప్పుడు.. కొంచెం కాస్ట్యూమర్ తో మాట్లాడవా అని రాజమౌళి అడిగేవాడు. దీంతో నేనే వెళ్లి మెటీరియల్ కొని.. తెచ్చేదాన్ని. అలా ‘సింహాద్రి’లోని అన్ని పాటలకూ నేనే కాస్ట్ర్యూమ్స్ సమకూర్చా. ‘సై’ సినిమా  నుంచి అఫిషియల్ అయిపోయా’’ అని రమ తెలిపింది.

https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg
subscribe my channel link
victory

Mahesh Babu, Murugadoss film's title revealed




Fans of Mahesh Babu were desperately waiting to know the title of his upcoming flick with AR Murugadoss. Several titles including 'Abhimanyu,' 'Sambhavami,' and 'Marmam' has been doing rounds in the industry for quite a long time. Finally the makers have zeroed in on 'Spyder.'


The makers revealed the name along with the first look poster of the movie on April 12. The movie is expected to be a spy thriller in which Mahesh Babu plays the role of an intelligence officer. So the title 'Spyder' seems apt for the movie as per buzz.


Rakul Preet Singh will be playing the female lead in the movie opposite to Mahesh Babu. SJ Suryah will be seen in the role of an antagonist in the movie. The film will be released in Telugu, Tamil, Hindi and Malayalam simultaneously on June 23.

https://www.youtube.com/channel/UCUJh7V52HcxzD4thwolb6hg